ఏడాది పాలనలో ఆర్టీసీ కొంత పుంతలు: ఫ్రీ జర్నీపై రూ.4,225 కోట్లు ఖర్చు

ఏడాది పాలనలో ఆర్టీసీ కొంత పుంతలు: ఫ్రీ జర్నీపై రూ.4,225 కోట్లు ఖర్చు
  • ఇప్పటిదాకా ఫ్రీ జర్నీపై రూ.4,225 కోట్లు ఖర్చు
  • టీఎస్  నుంచి టీజీగా రిజిస్ట్రేషన్లు
  • ట్రాన్స్ పోర్ట్  డిపార్ట్ మెంట్​కు ప్రత్యేక లోగో
  • పర్యావరణ హితం కోసంఎలక్ట్రిక్  బస్సుల వాడకం

హైదరాబాద్, వెలుగు :  కాంగ్రెస్ ఏడాది పాలనలో రవాణా శాఖ కొత్త పుంతలు తొక్కుతూ ప్రజల్లో తన ప్రత్యేకతను నిలబెట్టుకుంది. మంత్రి పొన్నం ప్రభాకర్  సారథ్యంలో రవాణా శాఖ అన్ని రంగాల్లో ప్రగతి బాటలో నడిచింది. ఉచిత బస్సు ప్రయాణం..మహిళల ఆర్థిక స్వావలంబన సాధించడంలో కీలక పాత్ర పోషించింది. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేశారు. దీంతో ఇప్పటి  వరకు 125.50 కోట్ల మంది మహిళలు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని వినియోగించుకున్నారు. ఈ పథకంపై ప్రభుత్వం రూ.4,225 కోట్లు భరించింది.

జీరో టికెట్ల నగదును ఆర్టీసీకి ఎప్పటికప్పుడు ప్రభుత్వం రీయింబర్స్  చేస్తుండడంతో ఆర్టీసీ లాభాల బాటలోకి వెళ్లింది. రవాణా శాఖ చరిత్రలో ఇప్పటి వరకు ప్రత్యేకమైన లోగో లేదు.సీఎం రేవంత్ రెడ్డి ఇటీవలే ఈ శాఖ ప్రత్యేకమైన లోగోకు ఆమోదముద్ర వేసి ఆవిష్కరించారు. ఈ ఏడాది మార్చి15న వాహన రిజిస్ట్రేషన్  కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ‘టీఎస్’ నుంచి ‘టీజీ’ కి రవాణా శాఖ మార్చింది. రాష్ట్రంలో నమోదైన వాహనాలకు ప్రత్యేక గుర్తింపును కల్పించేందుకు ఈ మార్పును అమలు చేస్తున్నారు.  ఇప్పటి వరకు 8,04,255 వాహనాలు టీజీతో రిజిస్ట్రేషన్ చేసుకున్నాయి. 

పర్యావరణహితం కోసం ముందడుగు

ఎలక్ట్రిక్  వెహికల్ (ఈవీ) పాలసీలో గ్రేటర్  హైదరాబాద్  మునిసిపల్  కార్పొరేషన్  పరిధిలో ఏటా సగటున 5 లక్షల వాహనాలు చేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది. పాలసీ వచ్చిన తరువాత నవంబరు 16 నుంచి డిసెంబరు 30 వరకు 8,497  ఎలక్ట్రిక్  వాహనాలు కొనుగోలు చేశారు. శబ్ద, వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ఎలక్ట్రిక్  వాహనాలకు వంద శాతం రోడ్  ట్యాక్స్  మినహాయింపు ఇవ్వడం, రిజిస్ట్రేషన్  ఫీజులను మినహాయించడంపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణహితమైన ప్రయాణ అనుభూతిని కలిగించడంతో పాటు కాలుష్య నివారణకు హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్ లో 251 ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీ ప్రారంభించింది.

2025 మార్చి నాటికి హైదరాబాద్ లో353, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, నల్లగొండ, సూర్యాపేటలో 446  ఎలక్ట్రిక్  బస్సులు అందుబాటులోకి రానున్నాయి. గ్రేటర్  హైదరాబాద్ లో కాలుష్య నివారణ కోసం సిటీలో మొత్తం ఎలక్ట్రిక్  బస్సులను నడిపేందుకు ఆర్టీసీ ప్లాన్ చేస్తోంది. త్వరలో దశల వారీగా 2,400 ఎలక్ట్రిక్  బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. అలాగే,  ప్రభుత్వం వెహికల్  ఫ్లీట్  ఆధునీకరణ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో రిజిస్టర్డ్  వెహికల్స్  స్క్రాపింగ్  ఫెసిలిటీస్ (ఆర్వీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎఫ్) ఆటోమేటెడ్  టెస్టింగ్  స్టేషన్స్ (ఏటీఎస్) అమలు చేశారు.

దీంతో గడువు ముగిసిన వాహనాలను దశలవారీగా తొలగించడం, రహదారి భద్రతను మెరుగుపరచడం, పరిశుభ్రమైన వాతావరణాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం రూ.296 కోట్ల బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రాష్ట్రవ్యాప్తంగా 37  ఏటీఎస్ లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే, మహిళా ప్రయాణికుల భద్రత కోసం వెహికల్  ట్రాకింగ్  సిస్టమ్ ను అమలు చేస్తున్నారు.