- రన్నర్ గా హైదరాబాద్ విమెన్స్ ఫుట్ బాల్ క్లబ్
కోల్‌బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్ సింగరేణి ఠాగూర్ స్టేడియంలో ఐదు రోజులు జరిగిన అస్మిత సౌత్జోన్తెలంగాణ స్థాయి అండర్-–13 గర్ల్స్ ఫుట్బాల్పోటీలు ముగిశాయి. ఆదివారం లీగ్‌మ్యాచ్‌లో హకీంపేట తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ చాంపియన్ గా నిలిచింది. రెండో స్థానంలో హైదరాబాద్ విమెన్స్ ఫుట్‌బాల్ క్లబ్, మూడో ప్లేసులో ఆదిలాబాద్ పీకేఆర్ లెవల్ స్టార్ క్లబ్ నిలిచాయి. వాలాఫ్ ఖాన్ ఫుట్‌బాల్ ట్రోఫీని నిజామాబాద్ కేర్ ఫుట్బాల్అకాడమీ దక్కించుకుంది. బెస్ట్ ఫేయిర్‌ప్లే అవార్డును హైదరాబాద్ ట్విన్ సిటీస్ జట్టు, డిసిప్లెన్ టీమ్ అవార్డును గజ్వేల్ ఫుట్‌బాల్ క్లబ్ అందుకుంది.
టోర్నమెంట్లో ప్రతిభ చూపిన క్రీడాకారులు నక్షత్ర, సింధు, దీక్షిత, హరిణి, హిమబిందు, ధృతి, అక్షర ప్రత్యేక బహమతులు అందుకున్నారు. మంచిర్యాల ఆర్డీవో శ్రీనివాస్‌రావు, మందమర్రి సీఐ శశిధర్‌రెడ్డి, సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ స్టేట్ ప్రెసిడెంట్వాసిరెడ్డి సీతారామయ్య, క్యాతనపల్లి మున్సిపల్కమిషనర్ రాజు, సింగరేణి ఏస్వోటు జీఎం విజయప్రసాద్, ఆదిలాబాద్ఉమ్మడి జిల్లా ఫుట్బాల్అసోసియేషన్జనరల్సెక్రటరీ రఘునాథ్‌రెడ్డి, కాంగ్రెస్ టౌన్ ప్రెసిడెంట్ రాజు పాల్గొన్నారు.