తెలంగాణ క్రీడాకారులకు భారీగా నిధులు ఇస్తున్నం

తెలంగాణ క్రీడాకారులకు భారీగా నిధులు ఇస్తున్నం
  • కేంద్రమంత్రి మన్ సుఖ్ మాండవీయ వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు: పారిస్ ఒలింపిక్స్​కు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులకు వివిధ స్కీమ్​ల కింద పెద్ద మొత్తంలో నిధులు ఖర్చు చేస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. గురువారం రాజ్య సభలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అడిగిన ప్రశ్నకు యువజన, క్రీడల శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. తొమ్మిది మంది తెలంగాణ క్రీడాకారులపై వివిధ స్కీం ద్వారా చేస్తోన్న ఖర్చుల వివరాలను వెల్లడించారు. 

మిషన్ ఒలింపిక్ కమిటీ(ఎంఓసీ) కేటాయింపుల ప్రకారం..బ్యాడ్మింటన్ మెన్స్ డబుల్ లో సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డికి రూ.1.89 కోట్లు, బ్యాడ్మింటన్ సింగిల్స్​లో శ్రీకాంత్ కిదాంబికి రూ. 85 లక్షలు, బ్యాడ్మింటన్ ఉమెన్ సింగిల్స్ లో పీవీ సింధూకు రూ. 1.87 కోట్లు, బ్యాడ్మింటన్ ఉమెన్ డబుల్స్ లో గాయత్రి గోపిచంద్ కు రూ. 22.53 లక్షలు, బాక్సింగ్ 50 కేజీల విభాగంలో నిఖత్ జరీన్ కు రూ. 33.55 లక్షలు కేటాయించినట్లు వెల్లడించారు.