హైదరాబాద్, వెలుగు : తెలంగాణ ఓపెన్ స్క్వాష్ రాకెట్ టోర్నమెంట్‌లో ధ్రువ్ కుమార్ శుభారంభం చేశాడు. గోల్కొండలోని గోల్ఫ్ క్లబ్‌లో బుధవారం జరిగిన మెన్స్ సింగిల్స్ తొలి రౌండ్‌లో ధ్రువ్ కుమార్ 11–6, 11–4, 11–1తో జైనేంద్ర భండారిని ఓడించాడు. మరో మ్యాచ్‌లో అదీవ్ దేవయ్య 11–9, 5–11, 7–11, 11–8, 11–7తో రిషి పన్వార్‌పై విజయం సాధించాడు.
స్క్వాష్ రాకెట్ ఫెడరేష్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీ వరకు జరిగే ఈ టోర్నీని ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ముఖ్య అతిదిగా హాజరై ప్రారంభించారు. తెలంగాణ స్క్వాష్ రాకెట్ సంఘం ప్రెసిడెంట్ విష్ణురాజు, సెక్రటరీ శ్రీవాసు, మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.