బాల్కొండ, వెలుగు : శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఎగువ నుంచి వస్తున్న వరద పెరగడంతో ఆఫీసర్లు నాలుగు గేట్లు ఓపెన్ చేశారు. శుక్రవారం ఉదయం 8525 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. ఎగువ గోదావరి క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్న వర్షాలకు వరద పెరిగింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 34,221 క్యూసెక్కులు చేరిందని ఆఫీసర్లు తెలిపారు.
జలాశయం నిండుకుండలా ఉండటంతో 4 గేట్లు ఓపెన్‌చేసి గోదావరిలోకి 12496 క్యూసెక్కులు వదులుతున్నారు. కాకతీయ కాలువకు 6800 క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా గోదావరిలోకి 1200 క్యూసెక్కులు, లక్ష్మీ కాలువకు 150 క్యూసెక్కులు,సరస్వతీ కాలువకు 500 క్యూసెక్కులు, గుత్ప ఎత్తిపోతల ద్వారా 135 క్యూసెక్కులు విడుదల చేశారు.