- ఏప్రిల్ 4 వరకుకొనసాగనున్న పరీక్షలు
- షెడ్యూల్ రిలీజ్ చేసిన ఎస్ఎస్సీ బోర్డు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మార్చి 21 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4 వరకు కొనసాగుతాయి. ఈ మేరకు గురువారం ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ (ఎస్ఎస్సీ బోర్డు) డైరెక్టర్ కృష్ణారావు షెడ్యూల్ను రిలీజ్ చేశారు. ప్రధాన పరీక్షలు మార్చి21 నుంచి ఏప్రిల్ 2 వరకు కొనసాగనుండగా, 3, 4 తేదీల్లో ఓఎస్ఎస్సీ, ఒకేషనల్ కోర్సుల పరీక్షలు ఉంటాయి.
టెన్త్ పరీక్షలు రోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగనున్నాయి. ఫిజికల్ సైన్స్, బయోలాజికల్ సైన్స్ ఎగ్జామ్స్ మాత్రం ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు ఉంటాయి. ఇంగ్లిష్, సైన్స్ ఎగ్జామ్స్ మినహా మిగిలిన అన్ని పరీక్షలకు ఆబ్జెక్టీవ్ పేపర్ (పార్ట్ బీ)ను చివరి అరగంట ముందు అందించనున్నారు. సైన్స్ పేపర్లకు చివరి పదిహేను నిమిషాల ముందు ఇవ్వనున్నారు. ఇంగ్లిష్ పేపర్ మాత్రం పార్ట్ ఏ, పార్ట్ బీ రెండూ ఒకేసారి విద్యార్థులకు అందిస్తారు.
టెన్త్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్:
తేదీ సబ్జెక్టు
మార్చి 21 ఫస్ట్ లాంగ్వేజ్
మార్చి 22 సెకండ్ లాంగ్వేజ్
మార్చి 24 థర్డ్ లాంగ్వేజ్(ఇంగ్లిష్)
మార్చి 26 మ్యాథమెటిక్స్
మార్చి 28 ఫిజికల్ సైన్స్
మార్చి 29 బయోలాజికల్ సైన్స్
ఏప్రిల్ 2 సోషల్ స్టడీస్
ఏప్రిల్ 3 ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజీ
పేపర్ –1(సంస్కృతం, అరబిక్)
ఏప్రిల్ 4 ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజీ
పేపర్ –2 (సంస్కృతం, అరబిక్)