మార్చి 21 నుంచి టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్స్.. నిర్ణీత టైమ్కు 5 నిమిషాల గ్రేస్ పీరియడ్

మార్చి 21 నుంచి టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్స్.. నిర్ణీత టైమ్కు 5 నిమిషాల గ్రేస్ పీరియడ్
  • అటెండ్ కానున్న 5.09 లక్షల స్టూడెంట్లు
  • నిర్ణీత టైమ్కు 5 నిమిషాల గ్రేస్ పీరియడ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈనెల 21 నుంచి టెన్త్  పబ్లిక్  పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 4 వరకూ జరిగే ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 5,09,403 మంది విద్యార్థులు అటెండ్ కానున్నారు. దీంట్లో 2,58,895  బాయ్స్,  2,50,508  గర్ల్స్ ఉన్నారు. వీరి కోసం మొత్తం 2,650 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. 

పరీక్షలు రోజూ ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహిస్తామని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్  కృష్ణారావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాగా, ఫస్ట్ లాంగ్వేజ్ (కాంపోజిట్ కోర్సు) పరీక్ష ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:50 వరకు జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అలాగే, సైన్స్  సబ్జెక్టులకు ఫిజికల్, బయోలజీ పరీక్షలను ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు నిర్వహిస్తామని వివరించారు.

పరీక్షల నిర్వహణ కోసం 2,650 మంది సీఎస్​లు, డీఓలను, 28100 మంది ఇన్విజిలేటర్లను నియమించామని తెలిపారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను www.bse.telangana.gov.in  వెబ్ సైట్  ద్వారా డౌన్ లోడ్  చేసుకోవచ్చని చెప్పారు. కాగా, నిర్ణీత టైమ్​ కన్నా 5 నిమిషాల గ్రేస్ పీరియడ్  ఇచ్చామని పేర్కొన్నారు. అయితే, విద్యార్థులు కనీసం అరగంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకునేలా ఏర్పాటు చేసుకోవాలని కృష్ణారావు సూచించారు.