
వికారాబాద్, వెలుగు: లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గడ్డం ప్రసాద్‌కుమార్ సోమవారం కలిశారు. బిహార్ రాజధాని పాట్నాలో జరుగుతున్న 85వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ (ఏఐపీఓసీ) మంగళ, బుధవారాల్లో జరగనుంది. ఈ సమావేశాల్లో పాల్గొనడానికి రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్, లేజిస్లేచర్ సెక్రటరీ నరసింహా చార్యులు పాట్నాకు చేరుకున్నారు.