తెలంగాణ స్టేట్ బెస్ట్ ఆర్టీసీ బస్సు డిపోల్లో సత్తుపల్లి సెకండ్

సత్తుపల్లి, వెలుగు : టీఎస్​ఆర్టీసీలో రాష్ట్ర  వ్యాప్తంగా 2022–23 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రంలో ఉత్తమ ద్వితీయ బస్సు డిపోగా సత్తుపల్లి డిపో ఎంపికైనట్లు డీఎం రాజ్యలక్ష్మి తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం డిపోలోని 360 మంది ఉద్యోగులకు వివిధ  కేటగిరి వారీగా బహుమతులు అందజేశారు.

 ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భవిష్యత్ లో డిపో  మరిన్ని అవార్డులు అందుకునేలా సిబ్బంది సహకరించాలని కోరారు. అసిస్టెంట్ మేనేజర్ పి.విజయ శ్రీ,  సిబ్బంది పాల్గొన్నారు.