హైదరాబాద్, వెలుగు: రాష్ర్టానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు బుధవారం ప్రధాని మోదీని కలవనున్నారు. ఉదయం 11గంటలకు తెలంగాణ ప్రజాప్రతినిధులకు మోదీ అపాయింట్మెంట్ లభించింది. దీంతో మంగళవారం సాయంత్రమే నేతులు ఢిల్లీకి పయనమయ్యారు. వారంతా ప్రధానిని కలువనున్నారు.
తెలంగాణలో బీజేపీ నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎంపికైన తర్వాత అందరూ కలిసి తొలిసారిగా ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. దీనికి విదేశాల్లో ఉన్న బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మినహా మిగిలిన వారంతా అటెంట్ అయ్యే అవకాశం ఉంది. తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాలను మోదీకి ప్రజాప్రతినిధులు వివరించనున్నారు.