హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు లిమిటెడ్ పాలకవర్గం ముఖ్యమంత్రి సహాయనిధికి కోటిన్నర(రూ.1,51,01,116 ) విరాళం అందించింది. బుధవారం ( నవంబర్6న) జూబ్లీహిల్స్ లోని నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లను టీజీ కాబ్ పాలవర్గం సభ్యులు కలిశారు. ఈ మేరకు విరాళం చెక్కును అందజేశారు. సీఎంను కలిసిన వారిలో TGCAB చైర్మన్ ఎం రవీందర్ రావు, వైస్ చైర్మన్ కే. సత్తయ్య, పలువులు డైరెక్టర్లు ఉన్నారు.
తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు లిమిటెడ్ (#TGCAB) పాలకవర్గం ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.1,51,01,116 విరాళం అందించింది. మంత్రి @Tummala_INC గారితో కలిసి టీజీకాబ్ పాలకవర్గం ముఖ్యమంత్రి @revanth_anumula గారిని జూబ్లీహిల్స్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, ఈ మేరకు విరాళం చెక్కును… pic.twitter.com/z9zBeZf76n
— Telangana CMO (@TelanganaCMO) November 6, 2024