భద్రాచలం, వెలుగు : భద్రాచలంలోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ బాలికల హాస్టల్‌ను శనివారం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, డీసీసీ ప్రెసిడెంట్ పొదెం వీరయ్య తనిఖీ చేశారు. తరగతి గదులు, స్టోర్ రూమ్స్, వంటగది, వాష్ రూం, డ్రైనేజీలను పరిశీలించారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మెరుగైన సదుపాయాలు అందించే బాధ్యత తమదని భరోసా ఇచ్చారు. స్టూడెంట్లతో కలిసి భోజనం చేశారు. త్వరలో భద్రాచలానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్ మంజూరు అవుతుందని ఆయన వెల్లడించారు.