కొండగట్టు,వెలుగు : కొండగట్టు అంజన్నను దర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలంగాణ రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ రెడ్డి అన్నారు. శనివారం కుటుంబ సభ్యులతో కలిసి అంజన్నను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు డీజీపీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికి స్వామివారి దర్శనానంతరం శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు.
అంతకుముందు జగిత్యాల జిల్లా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అంజన్నను కోరుకుంటున్నట్లు తెలిపారు. జిల్లా ఎస్సీ అశోక్ కుమార్, డీఎస్పీ రఘు చందన, సీఐ నీలం రవి ఉన్నారు.