
హైదరాబాద్, వెలుగు : పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా సప్లిమెంటరీ ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని అధికారులను రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. గతేడాది అక్టోబర్1వ తేదీ నుంచి డిసెంబర్31 వరకు ఓటర్ల జాబితాను అప్డేట్ చేసినట్లు తెలిపింది.
దానికి అనుగుణంగా టీ పోల్సాఫ్ట్వేర్నుంచి ఫిబ్రవరి 3 వరకు సప్లిమెంటరీ ఓటర్ల జాబితా ప్రచురించాలని..దీనిపై మండల స్థాయిలో రాజకీయ పార్టీలతో మీటింగ్ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం గురువారం ప్రత్యేక సర్య్కులర్ను జారీ చేసింది. ఫైనల్ సప్లిమెంటరీ జాబితాను ఫిబ్రవరి 6వ తేదీ కల్లా పూర్తి చేయాలని స్పష్టం చేసింది.