తెలంగాణలో మొత్తం ఎంతమంది ఓటర్లు అంటే.?

తెలంగాణలో మొత్తం ఎంతమంది ఓటర్లు అంటే.?

 తెలంగాణలో  సవరించిన ఓటర్ల లిస్ట్ ను  స్టేట్ ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసింది.  లిస్ట్ ప్రకారం తెలంగాణలో మొత్తం 3 కోట్ల35 లక్షల 27 వేల 925 మంది ఓటర్లు ఉన్నట్లు తెలిపింది. ఇందులో  కోటి 66లక్షల 41 వేల489 మంది పురుషు ఓటర్లు.. కోటి 68 లక్షల 67 వేల 735 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. 2లక్షల829 మంది థర్డ్ జెండర్ ఓటర్లు  ఉన్నట్లు ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది. అత్యధికంగాశేర్లింగపల్లి నియోజకవర్గంలో 7 లక్షల 65 వేల982.. అత్యల్పంగా భద్రాచలం నియోజకవర్గంలో లక్షా 54 వేల 134 ఓట్లు ఉన్నాయి. 

  • 18 నుంచి 19 సంవత్సరాల వయసున్న ఓటర్లు 5,45,026
  • 85 సంవత్సరాలు దాటిన సీనియర్ ఓటర్లు  2,22,091
  • ఎన్ఆర్‌ఐ ఓటర్లు  3,591

ALSO READ | కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయం.. హరీశ్ వేరే పార్టీ చూసుకోవాల్సిందేే: మహేశ్ కుమార్ గౌడ్