తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష(టీఎస్ సెట్)-2022 నోటిఫికేషన్ను ఉస్మానియా విశ్వవిద్యాలయం విడుదల చేసింది. రాష్ట్రంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కళాశాలల లెక్చరర్లు అర్హత సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టీఎస్ సెట్ నిర్వహిస్తోంది.
అర్హత : కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టులో మాస్టర్స్ డిగ్రీ (ఎంఏ, ఎంస్సీ, ఎంకాం, ఎంబీఏ, ఎంఎల్‌ఐఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంసీజే, ఎల్‌ఎల్‌ఎం, ఎంసీఏ, ఎంటెక్(సీఎస్ఈ, ఐటీ)) ఉత్తీర్ణులై ఉండాలి.
ఎగ్జామ్ ప్యాటర్న్: కంప్యూటర్ ఆధారిత టెస్టు(సీబీటీ) పద్ధతిలో జరిగే పరీక్షకు రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి మూడు గంటలు.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో డిసెంబర్ 30 నుంచి జనవరి 20 వరకు అప్లై చేసుకోవాలి. మార్చిలో పరీక్ష నిర్వహించనున్నారు. పూర్తి వివరాలకు www.telanganaset.org వెబ్సైట్ సంప్రదించాలి.