హైదరాబాద్, వెలుగు: తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీసెట్) ఎగ్జామ్స్ మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. మూడ్రోజుల పాటు జరిగే ఈ పరీక్షలకు 33,764 మంది అటెండ్ కానున్నారని టీజీ సెట్ మెంబర్ సెక్రటరీ గడ్డం నరేశ్ రెడ్డి తెలిపారు. ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 వరకు పరీక్షలు జరుగుతాయని చెప్పారు.
ఈ నెల10న 11,570 మంది, 11న 10,479 మంది, 12న 11,265 మంది పరీక్షలకు అటెండ్ అవుతారని పేర్కొన్నారు. ప్రతి సెషన్ లో 24 వరకు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. 15 నిమిషాల ముందే పరీక్షా కేంద్రాల గేట్లు మూసివేస్తామన్నారు.