మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తా

మత్స్యకారుల అభివృద్ధికి కృషి చేస్తా

నిజాంపేట్, వెలుగు: మండల పరిధిలోని చల్మెడ గ్రామంలో జరుగుతున్న గంగమ్మ గుడి ఆలయ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రతిష్ఠ  కార్యక్రమానికి హాజరైన ఆయనకు మత్స్యకారులు ఘనంగా స్వాగతం పలికారు. గంగమ్మ గుడి ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని సాయి కుమార్ అన్నారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం తనవంతు కృషి చేస్తానని తెలిపారు.