కేసీఆర్ తోనే ప్రజా సంక్షేమం : జగదీశ్ రెడ్డి

పెన్ పహాడ్ వెలుగు: సీఎం కేసీఆర్​తోనే ప్రజా సంక్షేమం జరుగతుందని మంత్రి జగదీశ్​ రెడ్డి అన్నారు.  గురువారం మండల కేంద్రంలోని సత్య గార్డెన్ లో నిర్వహించిన దివ్యంగుల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో దివ్యాంగులకు రూ.4వేల పింఛన్​ఇస్తున్నామన్నారు. దేశంలో  ఎక్కడా లేని విధంగా  రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు.

ఓటు అడిగే హక్కు కేవలం బీఆర్​ఎస్​కు మాత్రమే ఉందన్నారు. అనంతరం లింగాల, ధూపహడ్ గ్రామాలకు చెందిన కాంగ్రెస్,  బీజేపీకి చెందిన100 కార్యకర్తలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.  కార్యక్రమంలో  ఒంటెద్దు నర్సింహారెడ్డి , ఎంపీపీ బిక్షం, దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు షేక్ నహీం,సోమయ్య,  వెంకట్ రెడ్డి, నర్సయ్య, రామకృష్ణ, సీతారాంరెడ్డి. బైరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,చెన్ను శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ALSO READ : కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి