
మెదక్ /పాపన్నపేట, వెలుగు: మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని ఏడుపాయల వనదుర్గామాత జాతరకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 2 కోట్ల నిధులు మంజూరు చేసింది. మూడు రోజుల పాటు జాతర నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు కల్పించేందుకు అధికారులు నిధులను వినియోగిస్తారు. కలెక్టర్ రాహుల్రాజ్ఆధ్వర్యంలో విస్తృతంగా ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు. ఏడుపాయల జాతర రాష్ట్ర పండుగ కావడంతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పాల్గొని అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించానున్నారు.