Good News : సింగరేణి ఉద్యోగులకు లక్షా 90 వేల బోనస్.. ఫస్ట్ టైం కాంట్రాక్ట్ కార్మికులకూ బోనస్

Good News : సింగరేణి ఉద్యోగులకు లక్షా 90 వేల బోనస్.. ఫస్ట్ టైం కాంట్రాక్ట్ కార్మికులకూ బోనస్

సింగరేణి కార్మికులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. చరిత్రలో తొలిసారి కార్మికులకు పెద్ద మొత్తంలో ఒక్కో కార్మికుడికి లక్షా 90వేల బోనస్ ప్రకటించింది. 

సింగరేణి లాభాల్లో కార్మికులు ఆనందం చూడాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా బోనస్ ఇచ్చింది. 2023-24 ఏడాదిలో సింగరేణి సంస్థనుంచి 4వేల 701 కోట్ల లాభం వచ్చింది..ఇందులో 2వేల 289కోట్లు సింగరేణి విస్తరణకు పెట్టుబడిగా పెట్టాం..796కోట్ల లాభాలను కార్మికులకు పంచుతున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 

సింగరేణిలో మొత్తం 41వేల 837 మంది పర్మినెంట్ ఉద్యోగులున్నారు. వీరితోపాటు కాంట్రాక్టు వర్కర్లుగా 25వేల మంది పనిచేస్తున్నారు. సింగరేణి పర్మినెంట్ ఉద్యోగులకు ఒక్కొక్కరికి లక్షా 90వేల బోనస్ ప్రకటించింది రాష్ట్రప్రభుత్వం. 

ఎప్పుడు లాభాలు వచ్చినా.. పర్మినెంట్ ఉద్యోగులకు మాత్రమే బోనస్ ఇచ్చేవారు.. ఈసారి ఫస్ట్ టైం.. సింగరేణి చరిత్రలో మొదటిసారిగా మానవతా దృక్పథంతో కాంట్రాక్టు్  కార్మికులకు కూడా బోనస్ ఇస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టీ చెప్పారు. ఒక్కొక్కరికిగా రూ. 5వేల బోనస్ ప్రకటించారు.

దసరా పండగ కంటే ముందే బోనస్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భవిష్యత్ లో లాభాలతోపాటు.. సింగరేణి వ్యవస్థ తర్వాత తరానికి ఉపయోగపడే విధంగా రామగుండంలో పెట్టుబడి పెట్టాలని నిర్ణయించారు. 

రామగుండంలో వెయ్యి మెగావాట్ల పవర్ ప్రాజెక్ట్.. 500 మెగావాట్ల పంప్ స్టోరేజ్ ఏర్పాటు చేయనున్నారు. థర్మల్ పవర్ ప్లాంట్ కు సంబంధించి.. జైపూర్ లో కూడా విస్తరించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. టీఎస్ జెన్ కో కలిసి.. జాయింట్ వెంచర్గా మరో ప్రాజెక్టు ను ఏర్పాటు చేయనున్నారు.