హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని పది ఉమ్మడి జిల్లాలకు పది మంది ప్రత్యేక అధికారులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 10 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగిస్తూ సీఎస్ శాంతి కుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు ఈ ఆఫీసర్లు పనిచేయనున్నట్లు తెలిపారు.
హైదరాబాద్‌కు- ఆమ్రపాలి, రంగారెడ్డి- దివ్య, మహబూబ్‌నగర్- రవి, నల్గొండకు- అనితా రామచంద్రన్, వరంగల్- కు టీవీ కృష్ణారెడ్డి, మెదక్ కు - దాసరి హరిచందన, నిజామాబాద్ కు- ఏ.శరత్, ఆదిలాబాద్ కు- ఇలంబరితి, కరీంనగర్ కు- ఆర్వీ కర్ణన్, ఖమ్మం-కు కే.సురేంద్ర మోహన్‌కు బాధ్యతలు అప్పగించారు.
ఈ నెల3 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీకి 119 నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో అధికారులు సర్వే నిర్వహించనున్నారు. పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్న ఈ పరిశీలనను సమర్థవంతంగా చేపట్టాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. 238 ప్రాంతాల్లో నిర్వహించబోయే క్షేత్రస్థాయి పరిశీలనను ఈ ప్రత్యేక అధికారులు మానిటరింగ్ చేస్తారని తెలుస్తోంది.