రైతులకు గుడ్ న్యూస్ : పాస్ బుక్ ఆధారంగా రూ.2 లక్షల రుణ మాఫీ

రైతులకు గుడ్ న్యూస్ : పాస్ బుక్ ఆధారంగా రూ.2 లక్షల రుణ మాఫీ

హైదరాబాద్:రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.రుణమాఫీ పై మరో నాలుగు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయనుంది. పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదని తెలిపింది. రేషన్ కార్డు కేవలం కుటుంబాన్ని గుర్తించడం కోసమే అని తెలిపింది. కేంద్ర బడ్జెట్ పెట్టిన రెండు రోజుల తర్వాత రాష్ట్ర బడ్జెట్  సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై దృష్టి పెడతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఉచిత బస్సు పథకం కోసం నెలకు రూ. 350 కోట్లకు పైగా ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. 

మరోవైపు రైతుబంధు దుర్వినియోగం పై రాష్ట్ర కేబినెట్ కు నోట్ అందజేసింది వ్యవసాయ శాఖ. గత ప్రభుత్వ హయాంలో.. 12 విడతల్లో కలిపి 26వేల 5వందల కోట్లు ప్రజా ధనం దుబారా అయినట్లు గుర్తించింది. హైవేలు, వెంచర్లు, బీడు భూములకు కూడా.. గత ఆరేండ్లలో 18 వేల కోట్ల రూపాయలు చెల్లించారని తెలిపింది. గత బీఆర్ఎస్ హయాంలో ప్రతి విడతలో.. 2 వేల కోట్ల రుపాయలకు పైగా దుర్వినియోగం అయినట్లు గుర్తించింది కాంగ్రెస్ సర్కార్. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం..రైతు భరోసాలో ఎలాంటి తప్పిదాలు లేకుండా చర్యలు చేపట్టింది.