ఉదయ్ ​స్కీమ్ ​కింద డిస్కమ్ నష్టాలకు రూ.3,175 కోట్లు విడుదల

హైదరాబాద్, వెలుగు: నష్టాల్లో ఉన్న డిస్కమ్‌‌లను ఆదుకునేందుకు ఉదయ్‌‌ స్కీమ్​లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.3175.36 కోట్ల(50శాతం నిధులు)ను విడుదల చేసింది. గురువారం ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్​ రోస్​ ఉత్తర్వులు జారీ చేశారు. 2023=24 ఫైనాన్షియల్​ ఇయర్​కు గానూ ఈ నిధులను విడుదల చేశారు. డిస్కమ్‌‌లను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 2017లో  ఉదయ్‌‌ పథకం తీసుకొచ్చింది. 

అయితే, 2023=24 ఫైనాన్షియల్​ ఇయర్​లో సదరన్​ డిస్కమ్‌‌ కు రూ.4909.53కోట్లు, నార్తర్న్​ డిస్కమ్ కు రూ.1441.18 కోట్లు మొత్తం రూ.6350.71కోట్ల  ట్రాన్స్​మిషన్​ లాసెస్​ వచ్చినట్లు ట్రాన్స్​కో  రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ నష్టాల్లో 50 శాతం నిధులు రూ.3175.36కోట్లు విడుదల చేసింది.