కుక్కల దాడి ఘటనలు అరికట్టేందుకు స్టేట్ లెవెల్ కమిటి: హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం

కుక్కల దాడి ఘటనలు అరికట్టేందుకు స్టేట్ లెవెల్ కమిటి: హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్:రాష్ట్రవ్యాప్తంగా కుక్కల దాడిలో పలువురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.. బుధవారం మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ లో వీధి కుక్కల దాడిలో ఏడాదిన్న బాలుడు మృతిచెందాడు. కుక్కల దాడిలో రాష్ట్రవ్యాప్తంగాతీవ్రంగా గాయపడిన వారు వందల్లో ఉన్నారు. ఇటీవల కుక్కల దాడులు విపరీతంగా పెరగడంతో తెలంగాణ ప్రభుత్వం కుక్కుల దాడులు నివారించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను అదేశించింది. అయితే కుక్కల దాడులు అరికట్టడంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని కొందరు కోర్టు పిటిషన్ వేశారు. గురువారం (జూ18) హైకోర్టులో విచారణ జరిగింది.వీధి కుక్కల దాడి ఘటనలను నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కుక్కల దాడి ఘటనలు నివారించేదుకు స్టేట్ లెవెల్ కమిటీలు ఏర్పాటు చేశామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. 

జీహెచ్ఎంసి వ్యాప్తంగా 3.79 లక్షల వీధి కుక్కలు ఉన్నాయన్న అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు తెలిపారు. హైదరాబాదులో ఆరు కేంద్రాల వద్ద కుక్కలకు స్టెరిలైజేషన్ చేస్తున్నామని చెప్పారు. ఒక్కో కేంద్రం వద్ద సుమారు రోజుకు 200 కుక్కలకు స్టెర్లైజేషన్ చేస్తున్నామన్నారు. స్టెర్లైజేషన్ ద్వారా ఎలా దాడి ఘటనలను ఆపుతారని హైకోర్టు  ప్రశ్నించగా..షెల్టర్ హోమ్స్ కి తరలిస్తే సమస్య పరిష్కారం అవుతుందన్న అనిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. నాగపూర్ లో దాదాపు 90 వేల కుక్కలను షెల్టర్ హోమ్ లో పెట్టినట్టు హైకోర్టుకు చెప్పారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలతో అనిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు భేటీ అయి పరిష్కారం చూపాలన్న హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ రెండు వారాలకు వాయిదా వేసింది.