- స్టేట్ హెల్త్ డైరెక్టర్ రవీందర్ నాయక్
పెనుబల్లి, వెలుగు : నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ పై నిర్లక్ష్యం చేయవద్దని, ఎప్పటికప్పుడు వంద శాతం పూర్తి చేయాలని తెలంగాణ స్టేట్ హెల్త్ డైరెక్టర్ రవీందర్ నాయక్ సూచించారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకాసాగర్ పీహెచ్ సీని ఆదివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాము, కుక్క కాటు వాక్సిన్లను ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.
పీహెచ్సీలో ఉన్న ఔషధ, పూల పార్క్ ను పరిశీలించి మొక్కలు నాటారు. మూడు నెలలుగా గర్భిణుల నమోదులో పీహెచ్సీ జిల్లాలో ప్రథమ స్థానంలో ఉన్నందుకు యన్ క్వాస్ సర్టిఫికెట్ ను సిబ్బందికి అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్ వో వీ.సుబ్బారావు, డిప్యూటీ డీఎంహెచ్ వో సీతారాం, మెడికల్ ఆఫీసర్ చింత కిరణ్ కుమార్, డాక్టర్ సౌమ్య, సిబ్బంది
పాల్గొన్నారు.
వైద్య సిబ్బంది సేవలు సంతృప్తికరం
సత్తుపల్లి : సీజనల్ వ్యాధుల నివారణలో, వరదల సమయంలో ప్రజలకు సేవలు అందించడంలో వైద్య సిబ్బంది సేవలు అభినందనీయమని రవీంద్ర నాయక్ అన్నారు. సత్తుపల్లిలోని ప్రభుత్వ ఆస్పత్రిని ఆయన తనిఖీ చేశారు. ఇక్కడ త్వరలోనే వంద పడకల ఆస్పత్రి ప్రారంభిస్తామని చెప్పారు. జాబ్ క్యాలెండర్ ఆధారంగా నియామకాలు జరుగుతాయని, వైద్యులు అత్యవసరం అనుకుంటే కలెక్టర్, డీఎంహెచ్ వో ఆధ్వర్యంలో తాత్కాలిక నియామకాలు చేపట్టవచ్చన్నారు.