టీఆర్ఎస్… అంటే టోటల్ రివర్స్ స్టాండ్

టీఆర్ఎస్… అంటే టోటల్ రివర్స్ స్టాండ్

హైదరాబాద్: ఐటీఐఆర్ విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ఇద్దరిది దొంగాటేనని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐటీఐఆర్‌కు నాడు కాంగ్రెస్ అప్రూవల్ ఇచ్చిందని గుర్తుచేశారు. ఏడేళ్లయినా ఐటీఐఆర్‌పై టీఆర్ఎస్ కనీసం డీపీఆర్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగానే రాష్ట్రం ఐటీఐఆర్‌ను కోల్పోయిందని చెప్పారు. టీఆర్ఎస్ అంటే టోటల్ రివర్స్ స్టాండ్ అని ఎద్దేవా చేశారు.

ఐటీఐఆర్ కు సమానమైన పాకేజీ ఇవ్వాలంటూ కేటీఆర్ అనడం దారుణమని, కేటీఆర్ ..మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడని అన్నారు. కేటీఆర్ దగ్గర అసలు ప్రణాళికనే లేదు .. లెటర్ రాయడం ఏంటి .? అని ప్రశ్నించారు.  కమిషన్లు వచ్చేదుంటే ఐటీఐఆర్‌కు కూడా కేసీఆర్ డీపీఆర్ ఇచ్చేవారని, కమిషన్లు వచ్చినందుకే కాళేశ్వరాన్ని డీపీఆర్ లేకుండానే నిర్మించాడని చెప్పారు.