​42 శాతం బీసీ రిజర్వేషన్​కు సర్కారు కృషి : ఈరవత్రి అనీల్

​42 శాతం బీసీ రిజర్వేషన్​కు సర్కారు కృషి : ఈరవత్రి అనీల్
  •  మైన్స్​ డెవలప్​మెంట్ 
  • చైర్మన్​ ఈరవత్రి అనీల్​  

నిజామాబాద్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్​ సాధించడమే లక్ష్యంగా  కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని స్టేట్​ మైన్స్​ డెవలప్​మెంట్​ కార్పొరేషన్ చైర్మన్​ ఈరవత్రి అనీల్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్​లో మహాత్మా జ్యోతిబాపూలే జయంతి వేడుకల్లో ఆయన పాల్గొని నివాళులర్పించారు. కలెక్టర్​ రాజీవ్​గాంధీ హనుమంతు మాట్లాడుతూ  విలేజ్​ డెవలప్​మెంట్​కమిటీల పేరుతో చేస్తున్న సాంఘిక బహిష్కరణలను ఉపేక్షించమని హెచ్చరించారు. 

ఆర్థికంగా వెనుకబాటుతనం ఎదుర్కొంటున్న వారికి ఈడబ్ల్యూసీ సర్టిఫికెట్ సమగ్ర విచారణ తర్వాతే ఇచ్చేలా ఆర్డీవో, తహసీల్దార్​లకు ఆదేశాలు జారీ చేశామన్నారు.  జిల్లా లైబ్రరీ కమిటీ చైర్మన్​ అంతిరెడ్డి రాజిరెడ్డి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్​ స్రవంతి, అసిస్టెంట్ డైరెక్టర్ నర్సయ్య, గైని గంగారాం, బుస్స ఆంజనేయులు, నరాల సుధాకర్​, వినోద్​కుమార్​, రవీందర్, అర్బన్​ ఎమ్మెల్యే ధన్​పాల్​ సూర్యనారాయణ నగరంలోని జ్యోతిబాపూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.