తెలంగాణ స్టేట్ సెయిలింగ్ షురూ

తెలంగాణ స్టేట్ సెయిలింగ్ షురూ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: తెలంగాణ స్టేట్ సెయిలింగ్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌ ఎనిమిదో ఎడిషన్ గురువారం హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌‌‌‌‌‌‌‌లో ఘనంగా ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్‌‌‌‌లో 15 జిల్లాల నుంచి రికార్డు స్థాయిలో 131 మంది సెయిలర్లు ఆరు కేటగిరీల్లో పోటీ పడుతున్నారు. తొలి రోజు వర్షం, ప్రతికూల వాతావరణంలోనూ హుస్సేన్ సాగర్ నీటిపై సెయిలర్లు  రంగురంగుల బోట్లలో ట్రెయినింగ్‌‌‌‌,  ప్రాక్టీస్ చేశారు. ఈ సీజన్‌‌‌‌లో 29ఈఆర్‌‌‌‌‌‌‌‌ స్కిఫ్, 420 డబుల్ హ్యాండర్స్ కేటగిరీలను చేర్చడంతో రికార్డు స్థాయి ఎంట్రీలు వచ్చాయని తెలంగాణ సెయిలింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుహేమ్ షేక్ తెలిపారు.