మల్లన్న దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

మల్లన్న దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి
  • మాజీమంత్రి హరీశ్‌‌‌‌‌‌‌‌రావు

సిద్దిపేట రూరల్‌‌‌‌‌‌‌‌, వెలుగు : మల్లన్న దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌‌‌‌‌‌‌‌రావు ఆకాంక్షించారు. సిద్దిపేట రూరల్‌‌‌‌‌‌‌‌ మండలం ఇర్కోడ్‌‌‌‌‌‌‌‌ గ్రామంలోని మల్లన్న ఆలయంలో జరుగుతున్న ఉత్సవాలకు ఆదివారం ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌‌‌‌‌‌‌‌రావు మాట్లాడుతూ ఇర్కోడ్‌‌‌‌‌‌‌‌ మల్లన్న, కొమరవెల్లి మల్లన్న ఉత్సవాలు ఒకే రోజు జరగడం సంతోషంగా ఉందన్నారు. 

ఇర్కోడ్‌‌‌‌‌‌‌‌ మల్లన్నను చూస్తే కొమురవెల్లి మల్లన్నను చూసినంత ఆనందం ఉందన్నారు. అన్నదానంలో పాల్గొన్న అనంతరం గ్రామంలో కొత్తగా నిర్మిస్తున్న శ్రీ కృష్ణ దేవాలయం, జోడీ హనుమాన్‌‌‌‌‌‌‌‌ దేవాలయాన్ని సందర్శించి పూజలు చేశారు. ఆయన వెంట రాష్ట్ర కార్యదర్శి ఉప్పర మల్లేశం, న్యాయవాది ఎనగందుల శంకర్, ముత్యాల నరసింహులు, వాగమరే సునీత ఉన్నారు.

అయిల్‌‌‌‌‌‌‌‌పామ్‌‌‌‌‌‌‌‌ రైతులకు డబ్బులు చెల్లించాలి

అయిల్‌‌‌‌‌‌‌‌పామ్‌‌‌‌‌‌‌‌ రైతులకు వెంటనే డబ్బులు చెల్లించాలని, ఈజీఎస్‌‌‌‌‌‌‌‌లో మంజూరైన సీసీ రోడ్లు, అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని హరీశ్‌‌‌‌‌‌‌‌రావు డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలో జరిగిన ఈజీఎస్‌‌‌‌‌‌‌‌ పనులపై ఆదివారం రివ్యూ నిర్వహించారు. ఈజీఎస్‌‌‌‌‌‌‌‌లో మంజూరైన సీసీ రోడ్లు, అంగన్‌‌‌‌‌‌‌‌వాడీ కేంద్రాలు, సామాజిక భవనాల పనులు ప్రారంభం కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. 

అనంతరం సిద్దిపేట క్యాంప్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో విద్యాశాఖ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించి టెన్త్‌‌‌‌‌‌‌‌ ఫలితాల్లో సిద్దిపేట జిల్లా గతంలో మాదిరిగానే ముందు ఉండేలా కృషి చేయాలని సూచించారు. ఈ సారి కూడా టెన్త్‌‌‌‌‌‌‌‌ స్టూడెంట్లకు సాయంత్రం స్పెషల్‌‌‌‌‌‌‌‌ క్లాస్‌‌‌‌‌‌‌‌ల టైంలో అల్పాహారం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని వారం రోజుల్లో ప్రారంభిస్తానని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని విద్యా శాఖ ఆఫీసర్లను ఆదేశించారు.