ఐటీడీఏ యూనిట్ ​ఆఫీసర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి : ట్రైకార్​ జీఎం శంకర్​రావు

ఐటీడీఏ యూనిట్ ​ఆఫీసర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి : ట్రైకార్​ జీఎం శంకర్​రావు

భద్రాచలం, వెలుగు : బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు గిరిజన గౌరవ దినోత్సవాన్ని పురస్కరించుకుని పీఎం ధర్తీ అభజన్​ జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్​ను ప్రవేశ పెడుతోందని,  ఐటీడీఏ యూనిట్​ఆఫీసర్లు ఈ పథకం సక్సెస్​ అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ట్రైకార్​ జీఎం, స్పెషల్ ఆఫీసర్​ శంకర్​రావు ఆదేశించారు. ఐటీడీఏ మీటింగ్​ హాలులో గురువారం ఆయన ముందస్తు ఏర్పాట్లపై మీటింగ్​ నిర్వహించారు.

శుక్రవారం జరిగే ఈ వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఆదివాసీ గిరిజన సంక్షేమం, అభివృద్ధి కోసం అనేక రకాల పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. దానిలో భాగంగానే బిర్సా ముండా జయంతి వేళ పీఎం ధర్తీ అభజన్​ జాతీయ గ్రామ ఉత్కర్ష అభియాన్​ పథకం ప్రవేశపెట్టిందని తెలిపారు.