రాష్ట్రంలో వానలు.. వడగాలులు.. వాతావరణ శాఖ వెల్లడి

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులు మోస్తరు వర్షాలు పడటంతో పాటు వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే మూడ్రోజులు ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, నల్గొండ తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. అలాగే, అత్యధిక టెంపరేచర్లు నమోదవడంతో పాటు వడగాలులు కూడా వీచే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 8 నుంచి పదో తేదీ వరకు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనూ ఇదే రకమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయని పేర్కొంది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.