
సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ స్టెప్పులేయిస్తూ మహిళలని అసభ్యకరంగా చిత్రీకరిస్తున్నారంటూ తెలంగాణ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నేరెళ్ల శారద సీరియస్ అయ్యారు. ఆలాగే స్పెషల్ సాంగ్స్ పేరుతో మహిళలని కించ పరిచేలా చూపిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అలాగే హీరోయిన్స్ తో డ్యాన్స్ కంపోజ్ చేసే సమయంలో కొరియోగ్రాఫర్లు బాధ్యతాయుతంగా ఉండాలని లేదంటే చర్యలు తప్పవని తెలిపారు. ఈ మధ్యకాలంలో వచ్చిన సాంగ్స్ లో ఎక్కువగా డ్యాన్స్ స్టెప్పులతోపాటూ కాస్ట్యూమ్స్ కూడా మరీ మితిమీరి ఉంటున్నాయని కాబట్టి వీటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చివరగా మహిళల గౌరవాన్ని తగ్గించే పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది..
Also Read : నిమిషానికి 90 వేల రూపాయలా విష్ణుప్రియా
అయితే ఈ మధ్య డ్యాన్స్ కంపోజింగ్ పేరుతో పాటలోని లిరిక్స్ కి స్టెప్పులకి అస్సలు సంబంధం ఉండటం లేదు.. ఆమధ్య ఓ స్టార్ హీరో సినిమాలోనిస్పెషల్ సాంగ్స్ ని సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అయ్యింది. భాష రాని ఆ హీరోయిన్ తనని పొగుడుతున్నారని థాంక్స్ చెబుతూ స్టోరీలో కూడా షేర్ చేసింది.
ఇటీవలే నితిన్ హీరోగా నటించిన రాబిన్ హుడ్ సినిమాలోని అదిదా సర్‌ప్రైజు పాట రిలీజ్ అయ్యింది. ఇందులో యంగ్ హీరోయిన్ కేతిక శర్మ మల్లెపూల జాకెట్ ధరించి స్టెప్పులేసింది. దీంతో ఇదే స్టెప్పులని సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్స్ కూడా రీల్స్ చేస్తున్నారు. నెటిజన్లు ఇలాంటి పాటలకి అసభ్యకరమైన పదజాలాన్ని వాడుతూ కామెంట్లు చేస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే సినిమాల ప్రభావం సమాజంపై ఎంతగా ఉంటుందో అర్థం అవుతుంది. ఈ కారణంగానే మహిళా కమీషన్ స్పెషల్ సాంగ్స్ కొరియోగ్రాఫ్ విషయంలో సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.