Venu Swamy: వేణుస్వామికి మహిళా కమిషన్ నోటీసులు

అక్కినేని - నాగచైతన్య శోభిత ధూళిపాళ్ల వైవాహిక జీవితం సక్రమంగా సాగదంటూ జాతకం చెప్పిన వేణుస్వామి చిక్కుల్లో పడ్డారు. నాగచైతన్య- శోభిత నిశ్చితార్థం చేసుకున్నరోజునే రంగంలోకి దిగిన వేణుస్వామి మూడేళ్లలో వీరిద్దరూ విడిపోతారని జోస్యం చెప్పారు. మరో మహిళ ప్రమేయం కారణంగా 2027లో ఈ జంట విడిపోతారని అంచనా వేసి వివాదానికి తెరలేపారు. ఈ మేరకు వీరిద్దరి జాతకాలను వేణుస్వామి విశ్లేషణ చేసిన వీడియో బాగా వైరల్ అయ్యింది.

దీనిపై తెలుగు ఫిల్మ్ జర్న లిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసి యేషన్ ఆధ్వర్యంలో కొంతమంది జర్నలిస్టులు.. మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. వేణుస్వామిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద.. వేణుస్వామిపై, సదరు వీడియోలు ప్రసారం చేసిన యూట్యూబ్ ఛానెళ్లపై విచారణ చేసి తప్ప కుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలో మంగళవారం(ఆగష్టు 13) రాష్ట్ర మహిళా కమిషన్ వేణు స్వామికి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది.