
అమెరికా గన్ కల్చర్ కు ఇండియన్స్ బలి అవుతూనే ఉన్నారు. ఉన్నత చదువుల కోసం వెళ్లిన ఇండియన్స్.. ఏదో పార్ట్ టైమ్ జాబ్ చేసుకుంటూ స్టడీస్ పూర్తి చేస్తుంటారు. ఇదే అక్కడి యువతకు కడుపు మంటగా మారుతోంది.
తాజాగా అమెరికాలోనీ మిల్వాంకి విస్కాన్సిన్ సిటీలో నివాసం ఉంటున్న తెలంగాణ యువకుడు చనిపోవడం రంగారెడ్డి జిల్లాలో విషాదం నింపింది. షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండల కేంద్రానికి చెందిన గంప ప్రవీణ్ (27) బుధవారం (మార్చి5) తెల్లవారు జామున కాల్పులకు గురై మృతి చెందాడు.
ALSO READ : ట్రంప్ సంచలన నిర్ణయం.. అమెరికా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్గా 13 ఏళ్ల బుడ్డోడు
ఉన్నత చదువుల కోసం అమెరికా వెల్లి అక్కడ ఎంఎస్ సెకండ్ ఇయర్ చదువుతూ పార్ట్ టైంగా స్టోర్ లో జాబ్ చేస్తుండేవాడు ప్రవీణ్. బుధవారం డ్యూటీ నుంచి వస్తుండగా దుండగులు కాల్పులు జరపడంతో చనిపోయాడు. ప్రవీణ్ ఇంటికి దగ్గర్లో ఉండే బీచ్ వద్ద గన్ తో కాల్చడంతో మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే ఇది హత్యా, ఆత్మహత్య అనేది తెలియాల్సి ఉంది.