ఇంటర్ ఎగ్జామ్ ఫీజు గడువు పెంపు.. రూ. 2500 ఫైన్​తో జనవరి 25 వరకు ఫీజు చెల్లించొచ్చు

హైదరాబాద్, వెలుగు: ఫైర్ సెఫ్టీ లేని కాలేజీల విజ్ఞప్తి మేరకు ఇంటర్ ఎగ్జామ్ ఫీజు చెల్లింపు గడువును ఇంటర్ బోర్డు పొడిగించింది. రూ. 2500 ఫైన్​తో ఈ నెల 25 వరకు ఫీజు చెల్లించొచ్చని బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య చెప్పారు. మిక్స్ డ్ ఆక్యుపెన్సీ భవనాల్లో ఫైర్ సేఫ్టే లేకుండా  కొనసాగుతున్న కాలేజీలకు సర్కారు ఈ ఏడాదికి స్పెషల్ పర్మిషన్ ఇచ్చింది. ప్రస్తుతం కొత్తగా 220 ప్రైవేటు, కార్పొరేట్ కాలేజీలకూ ఇంటర్ బోర్డు అధికారులు అనుమతి ఇవ్వనున్నారు. దీంట్లో ఫస్టియర్ చదువుతున్న 35 వేలకు పైగా విద్యార్థులు ఎగ్జామ్ ఫీజు చెల్లించాల్సి ఉంది. అయితే, ఇప్పటికే ఎగ్జామ్‌‌‌‌ ఫీజును చెల్లించిన కాలేజీలకూ మినహాయింపు ఇవ్వాలని కోరగా, బోర్డు రూల్స్​ ప్రకారం ఫైన్​తో ఫీజు చెల్లించాలని బోర్డు స్పష్టం చేసింది.