- తైవాన్ లో ఈ నెల 15 నుంచి19 వరకు జరగనున్న గేమ్స్
హైదరాబాద్, వెలుగు: ఆసియా యూనివర్సిటీస్ ఉమెన్ సాఫ్ట్ బాల్ కప్ లో పాల్గొనేందుకు ముగ్గురు ఎస్సీ గురుకుల విద్యార్థులు ఆదివారం బయల్దేరి వెళ్లారు. ఈ నెల 15 నుంచి 19 వరకు తైవాన్ లో జరగనున్న ఈ గేమ్స్ లో ఆడేందుకు ఎస్సీ గురుకులాల్లో చదువుతున్న ముగ్గురు స్టూడెంట్స్ సెలక్ట్ అయినట్టు సెక్రటరీ అలుగు వర్షిణి ఆదివారం పత్రిక ప్రకటనలో తెలిపారు. ఈ క్రీడాకారులకు ప్రయాణం, వసతి ఇతర ఖర్చులన్నింటిని ప్రభుత్వం అందచేస్తుందన్నారు.
వీరికి స్పాన్సర్లు దొరకటం లేదని వస్తున్న వార్తలు అవాస్తవమని సెక్రటరీ స్పష్టం చేశారు. ఈ గేమ్స్ లో గురుకుల స్టూడెంట్స్ మెడల్స్ సాధించాలని సీఎం రేవంత్ రెడ్డి, ఎస్సీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ ఆకాంక్షిస్తున్నట్టు ఆమె పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ గేమ్స్ లో పాల్గొనే గురుకులాల విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉందని, వారి కోసం ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించిందని సెక్రటరీ అలుగు వర్షిణి వెల్లడించారు.