తెలంగాణకు మూడో ఓటమి

తెలంగాణకు మూడో ఓటమి

హైదరాబాద్‌‌, వెలుగు : సంతోష్ ట్రోఫీ నేషనల్ ఫుట్‌‌బాల్ టోర్నమెంట్‌‌ ఫైనల్ రౌండ్‌‌లో  ఆతిథ్య తెలంగాణ మూడో ఓటమి చవి చూసింది. శనివారం జరిగిన గ్రూప్‌‌–ఎ మ్యాచ్‌‌లో తెలంగాణ జట్టు 0–3తో జమ్మూ కాశ్మీర్ చేతిలో పరాజయం పాలైంది. దాంతో గ్రూప్ స్టేజ్‌‌లోనే ఇంటిదారి పట్టింది.

జమ్మూ జట్టులో హయత్‌‌ బషీర్ (5వ నిమిషం), అరుణ్‌‌ నగైల్ (74వ ని), అకీఫ్ జావైద్ (88వ ని) తలో గోల్‌‌ చేశారు. ఇతర మ్యాచ్‌‌ల్లో డిఫెండింగ్ చాంపియన్‌‌ సర్వీసెస్‌‌ 2–0తో రాజస్తాన్‌‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్ చేరుకుంది. వి.జి శ్రేయస్‌‌ (20వ ని), విజయ్ (85వ ని) తలో గోల్‌‌తో సర్వీసెస్‌‌ను గెలిపించారు.