తెలంగాణ టీ20 లీగ్‌ కొనసాగించరా?

  • తెలంగాణ టీ20 లీగ్‌ వద్దా?
  • వివేక్‌ వెంటకస్వామి ఆధ్వర్యంలో ఫస్ట్‌ ఎడిషన్‌ సూపర్‌ సక్సెస్‌
  • స్టేట్‌ లీగ్‌ను పట్టించుకోని అజరుద్దీన్‌ అండ్‌ కో
  • టీఎన్‌పీఎల్‌, కేపీఎల్‌తో ఆయా రాష్ట్రాల ప్లేయర్లకు ఐపీఎల్​ అవకాశాలు

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: ఐపీఎల్‌‌ ఆక్షన్‌‌లో కొన్నేళ్ల నుంచి తమిళనాడు, కర్నాటకకు చెందిన యంగ్‌‌స్టర్స్‌‌కు మంచి అవకాశాలు వస్తున్నాయి. కేసీ కరియప్ప, టి. నటరాజన్‌‌, కృష్ణప్ప గౌతమ్‌‌, దేవదత్‌‌ పడిక్కల్‌‌, షారూక్‌‌ ఖాన్‌‌ ఇలా చాలా మంది ప్లేయర్లను వివిధ ఫ్రాంచైజీలు కొనుగోలు చేశాయి. వీళ్లందరిలో ఉన్న కామన్‌‌ పాయింట్ ఒక్కటే. తమిళనాడు ప్రీమియర్‌‌ లీగ్‌‌ (టీఎన్‌‌పీఎల్‌‌), కర్నాటక ప్రీమియర్‌‌ లీగ్‌‌ (కేపీఎల్‌‌)లో సత్తా చాటి ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించారు.  ఈ టోర్నీల ద్వారా చాలా మంది మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వచ్చారు. కానీ, తెలంగాణ క్రికెటర్లకు మాత్రం ఆ అవకాశం లభించడం లేదు. లీగ్స్‌‌ను, స్టేట్‌‌ టీమ్‌‌ సెలెక్షన్స్‌‌ను అవినీతి, బంధుప్రీతితో నింపేసిన మహ్మద్‌‌ అజరుద్దీన్‌‌  నేతృత్వంలోని  హెచ్‌‌సీఏ ప్రస్తుత పాలక వర్గం తెలంగాణ టీ20 లీగ్‌‌ను పట్టించుకోవడం లేదు. అధికారంలోకి వచ్చి ఒకటిన్నరేళ్లు దాటిపోయినా.. ఈ లీగ్‌‌ నిర్వహణకు ముందుకు రావడం లేదు. టీఎన్‌‌పీఎల్‌‌, కేపీఎల్‌‌ మాదిరిగా తెలంగాణ గ్రామీణ ప్రాంతాల ఆటగాళ్లు తమ స్కిల్​ను ప్రూవ్‌‌ చూసుకునే ప్లాట్‌‌ఫామ్‌‌ ఇవ్వాలని వివేక్‌‌ వెంకటస్వామి హెచ్‌‌సీఏ ప్రెసిడెంట్‌‌గా ఉన్నప్పుడు 2018లో జి. వెంకటస్వామి మెమోరియల్‌‌ తెలంగాణ టీ20 లీగ్‌‌ (టీటీఎల్‌‌)ను స్టార్ట్‌‌ చేశారు.  తెలంగాణ అన్ని జిల్లాల్లోని ఆటగాళ్లకు అవకాశం వచ్చేలా పది జట్లతో లీగ్‌‌ను సూపర్‌‌ సక్సెస్‌‌ చేశారు.  జిల్లాల నుంచి ఎంతో మంది ప్లేయర్లు తమ టాలెంట్‌‌ను ప్రూవ్‌‌ చేసుకున్నారు. అండర్‌‌–19 వరల్డ్‌‌కప్‌‌లో ఇండియాకు ఆడిన యంగ్‌‌ సెన్సేషన్‌‌ తిలక్‌‌ వర్మ, జె. మల్లికార్జున్‌‌, అజయ్‌‌ దేవ్‌‌గౌడ్‌‌, మికిల్‌‌ జైస్వాల్‌‌, రాహుల్‌‌ బుద్ది, మీర్‌‌ జావేద్‌‌ అలీ తదితరులు టీటీఎల్‌‌లో సత్తా చాటే స్టేట్‌‌ టీమ్‌‌లోకి వచ్చారు. ఇంత గొప్ప ఫలితం ఇచ్చిన లీగ్‌‌ను కొనసాగించడంలో అజర్‌‌ అండ్‌‌ కో అలసత్వం చూపిస్తోంది.  తెలంగాణ ప్రీమియర్‌‌ లీగ్‌‌ పేరిట స్టేట్‌‌ లెవెల్‌‌ టీ20 టోర్నీకి అప్రూవల్‌‌ ఇచ్చినట్టు  గతేడాది నవంబర్‌‌ ఆరో తేదీన జరిగిన హెచ్‌‌సీఏ అపెక్స్‌‌ కౌన్సిల్‌‌ అనౌన్స్‌‌ చేసింది. టీ స్పోర్ట్స్‌‌ తో కలిసి వీలైనంత తొందర్లో టోర్నీని కండక్ట్‌‌ చేస్తామని చెప్పింది. ఈ ప్రకటన వచ్చి మూడు నెలల దాటినా అజర్‌‌ అండ్‌‌ కో లీగ్‌‌పై మళ్లీ స్పందించలేదు. టీమ్‌‌ సెలెక్షన్స్‌‌ మాదిరిగానే లీగ్‌‌ నిర్వహణ విషయంలో  అసోసియేషన్‌‌ పెద్దల మధ్య వాటాల పంచాయితీ వచ్చిందని హెచ్‌‌సీఏ వర్గాలు చెబుతున్నాయి. అయితే, టీఎన్‌‌పీఎల్‌‌, కేపీఎల్‌‌లో సత్తా చాటిన ప్లేయర్లకు నేరుగా ఐపీఎల్‌‌ అవకాశాలు వస్తుండడంతో మన రాష్ట్రంలో కూడా టీ20 లీగ్‌‌ను నిర్వహించాలని ఆటగాళ్లు, వాళ్ల తల్లిదండ్రులు, క్రీడాభిమానులు డిమాండ్‌‌ చేస్తున్నారు. హైదరాబాద్‌‌ నుంచి ఒక్క ప్లేయర్‌‌కు అవకాశం ఇవ్వలేదంటూ సన్‌‌రైజర్స్‌‌ ఫ్రాంచైజీపై అసంతృప్తి వ్యక్తం చేసిన అజర్‌‌ ముందుగా మన ప్లేయర్లు టాలెంట్‌‌ ప్రూవ్‌‌ చేసుకునే ప్లాట్‌‌ఫామ్‌‌ను ఏర్పాటు చేయాలని చెబుతున్నారు.మరి, హెచ్​సీఏ పెద్దలు ఏం చేస్తారో చూడాలి.

For More News..

తాగిన మత్తులో సూసైడ్ చేసుకున్న కార్మికులు

ఆన్‌లైన్ క్లాసులో న్యూసెన్స్ చేసిన వ్యక్తి

సింగరేణి సీఎండీ ఎక్స్​టెన్షన్​ చెల్లదు