
హైదరాబాద్: తెలంగాణ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నిషా ఇన్నాని.. ఖేలో ఇండియా పారా గేమ్స్‌లో గోల్డ్ మెడల్‌తో మెరిసింది. క్లాస్–8 ఫైనల్లో నిషా 8–11, 11–7, 12–10, 11–9తో సవితా అజ్జనకట్టి (కర్ణాటక)పై నెగ్గింది. అంతకుముందు జరిగిన సెమీస్‌లో నిషా 3–1తో మీనా బి పర్మార్ (గుజరాత్)ను ఓడించింది.
గత నెల 25 నుంచి 27 వరకు న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో ఈ గేమ్స్ జరిగాయి.