ఏప్రిల్ 15 నుంచి టెట్ దరఖాస్తులు

ఏప్రిల్ 15 నుంచి టెట్ దరఖాస్తులు
  • ఈ నెల 30 వరకూ అప్లైకి అవకాశం 

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్–2025 (టీజీ టెట్) దరఖాస్తుల ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం కానున్నది. ఈ నెల 15 నుంచి 30 వరకు ఆన్​లైన్​లో దరఖాస్తుల ప్రక్రియ కొనసాగనున్నది. ఒక పేపర్ కు రూ.750, రెండు పేపర్లకు రూ.వెయ్యి ఫీజు నిర్ణయించారు. డీటెయిల్డ్ నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులిటెన్​ను https://schooledu.telangana.gov.in వెబ్ సైట్​లో పెట్టారు.

 టెట్ హెల్ప్ డెస్క్ ఈ నెల 15 నుంచి జులై 22 వరకూ అన్ని వర్కింగ్ డేస్​లో పనిచేయనున్నది. ఏమైనా ఇబ్బందులు ఉంటే 7093958881 / 7093468882 నెంబర్లకు కాల్ చేయాలని అధికారులు సూచించారు. టెక్నికల్ ఇష్యూస్ వస్తే 7032901383 / 9000756178 నెంబర్లకు, ఇతర వివరాల కోసం  7093708883 / 7093708884 నెంబర్లకు కాల్ చేయాలని చెప్పారు. టెట్ ఎగ్జామ్స్ జూన్ 15 నుంచి 30 వరకూ ఆన్ లైన్ లో  జరుగనున్నాయి.