టీఎస్ యూటీఎఫ్ మహాసభలకు రండి

  • సీఎంకు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి ఆహ్వానం 

హైదరాబాద్, వెలుగు: వచ్చేనెల 28 నుంచి మూడ్రోజుల పాటు నల్లగొండలో జరిగే టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర మహాసభలకు రావాలని టీచర్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి సీఎం రేవంత్​రెడ్డిని కోరారు. ఈ మేరకు గురువారం సీఎంను క్యాంపు ఆఫీసులో కలిశారు. ఈ సందర్భంగా టీచర్ల సమస్యలనూ సీఎం దృష్టికి తీసుకుపోయారు. మోడల్ స్కూల్ టీచర్లకు 010 పద్దు ద్వారా జీతాలు, కేజీబీవీ టీచర్లకు మినిమమ్ బేసిక్ పే ఇవ్వాలని, గురుకుల టైమ్ టేబుల్ మార్చాలని విజ్ఞప్తి చేశారు.