టెన్త్ ఫలితాలు మరింత ఆలస్యం.. ఎన్ని గంటలకు అంటే..

టెన్త్ ఫలితాలు మరింత ఆలస్యం.. ఎన్ని గంటలకు అంటే..

విద్యార్థులతో పాటు తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పదో తరగతి పరీక్షలు మరింత ఆలస్యం కానున్నాయి. ఇవాళ (బుధవారం ఏప్రిల్ 30) మధ్యాహ్నం ఒంటి గంటకు ఫలితాలు విడుదల కావాల్సి ఉంది. రవీంద్ర భారతిలో సీఎం చేతుల మీదుగా ఫలితాలు విడుదల చేయాలని షెడ్యూల్ ఖరారు చేశారు. కానీ ఫిలితాల విడుదల కు మరింత సమయం పట్టనున్నట్లు ప్రకటించారు అధికారులు.

టెన్త్ పరీక్షలు మధ్యాహ్నం ఒంటి గంటకు కాకుండా మధ్యాహ్నం 2.15 గంటలకు విడుదల చేయనున్నట్లు ఎస్ ఎస్ సి బోర్డు ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డి ఫలితాలను విడుదల చేస్తారు. 

ఈసారి ఫలితాల్లో గ్రేడ్లకు బదులు మార్కులు ఇవ్వనున్నారు. సబ్జెక్టులకు మాత్రమే మార్కులు, గ్రేడ్​లు ఇవ్వనుండగా, ఓవరాల్ ఫలితాలను మాత్రం కేవలం మార్కుల వరకే పరిమితం చేయనున్నారు. కో కరికులమ్ యాక్టివిటీస్​లో కేవలం గ్రేడింగ్ మాత్రమే ప్రకటిస్తారు. ఫలితాలను https://bse.telangana.gov.in,  http://https://bse.telangana.gov.in, https://www.v6velugu.com తదితర వెబ్ సైట్లలో చూసుకోవచ్చు. 

రాష్ట్రవ్యాప్తంగా మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు పదో తరగతి పరీక్షలు జరిగాయి. 5,09,403 మంది హాజరయ్యారు. వారం క్రితమే ఫలితాల ప్రక్రియ పూర్తికాగా.. ఫలితాలు ఎలా ఇవ్వాలనే దానిపై సర్కారు నుంచి స్పష్టత  కోసం ఎస్​ఎస్​సీ బోర్డు అధికారులు వెయిట్ చేశారు. మూడ్రోజుల క్రితం దీనిపై స్పష్టత రావడంతో బుధవారం ఫలితాలు ఇచ్చేందుకు వారు రెడీ అయ్యారు. అందులో భాగంగా మధ్యాహ్నం 2.15 గంటలకు ఫలితాలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేస్తారు.