హైదరాబాద్: టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ (టెట్) అభ్యర్థులకు విద్యాశాఖ బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఇటీవల నిర్వహించిన టెట్ పరీక్షల ప్రిలిమినరీ ‘కీ’ విడుదల చేసింది విద్యాశాఖ. టెట్ కీతో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా వైబ్ సైట్లో అందుబాటులో ఉంచిననట్లు తెలిపింది. విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ ద్వారా కీ, రెస్పాన్స్ షీట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని అభ్యర్థులకు సూచించింది. కీపై అభ్యంతరాలు ఉంటే 2025, జనవరి 25 నుంచి 27వ తేదీ సాయంత్రం 5గంటల వరకు ఆన్‌లైన్‌లో సమర్పించాలని అభ్యర్థులకు సూచించింది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్.
కాగా, 2025 జనవరి 2వ తేదీ నుంచి జనవరి 20 తేదీ వరకు టెట్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా టీచర్ ఎలిజిబుల్ టెస్ట్‌కు 2 లక్షల 75 వేల 753 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో.. 74శాతం మంది పరీక్షకు హాజరైనట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. పరీక్షలు ముగిసిన నాలుగు రోజుల్లోనే టెట్ ‘కీ’ విడుదల చేయడం గమనార్హం.
ALSO READ | HPCLలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ ఉద్యోగాలు.. మంచి జీతం.. ఉద్యోగం కొడితే లైఫ్ సెటిల్