హైదరాబాద్: తెలంగాణలో టెట్ (TGTET) ఫలితాలను పాఠశాల విద్యాశాఖ బుధవారం ( ఫిబ్రవరి 5) న విడుదల చేశారు. తెలంగాణ టెట్ పరీక్షా ఫలితాల్లో 31.21 శాతం మంది అర్హత సాధించారు.
జనవరి 2 నుంచి జనవరి 20 వరకు తెలంగాణ టెట్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షకు మొత్తం లక్షా 35వేల 802 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో లక్షా 35వేల 802 మంది అభ్యర్థులు హాజరు కాగా.. వీరిలో 42,384 మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లు పాఠశాల విద్యాశాఖ సెక్రటరీ యోగితా రానా, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహారెడ్డి లు తెలిపారు. పేపర్ 1 లో 59.48 శాతం, పేపర్ లో 31.21 శాతం అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు.