గురుకుల సెట్‌‌ ఫలితాలు విడుదల

గురుకుల సెట్‌‌ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌‌, వెలుగు : ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకుల సొసైటీల్లో ఐదో తరగతి ప్రవేశానికి నిర్వహించిన  టీజీ సెట్‌‌-2022 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు  మంత్రి కొప్పుల ఈశ్వర్​ ఫలితాలను శనివారం విడుదల చేశారు. రిజల్ట్స్ కోసం https://tgcet.cgg.gov.in వెబ్‌‌సైట్‌‌ను సంప్రదించాలని అధికారులు తెలిపారు. నాలుగు సొసైటీల ఆధ్వర్యంలో 605 స్కూళ్లు ఉండగా.. ఐదో తరగతిలో ప్రవేశాలకు మే 8న కామన్‌‌ ఎంట్రన్స్ ఎగ్జామ్‌‌ నిర్వహించారు. మొత్తం 48,440 సీట్లకు గాను లక్షా 47వేల 924 మంది స్టూడెంట్స్‌‌ దరఖాస్తు చేసుకున్నారు.