నేడు సెక్రటేరియెట్​లో..తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు భూమిపూజ

నేడు సెక్రటేరియెట్​లో..తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనకు భూమిపూజ

హైదరాబాద్, వెలుగు: సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సీఎం రేవంత్ రెడ్డి బుధవారం భూమిపూజ చేయనున్నారు. ఉదయం 11:00 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.

విగ్రహ ఏర్పాటు కోసం సెక్రటేరియట్​లో సీఎం ఇప్పటికే ప్లేస్ సెలెక్ట్ చేశారు. ఆ ప్రదేశంలోనే ఈ విగ్రహావిష్కరణ జరగనుంది. సచివాలయం ఆవరణలో భవన ప్రధాన ద్వారం, బాహుబలి గేటు ముందు భాగం విగ్రహ ఏర్పాటుకు అనువైన ప్రదేశంగా భావించారు. ఈ ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రారంభిస్తామని ఇప్పటికే సీఎం ప్రకటించారు.