ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

పెండింగ్​ పనులు  పూర్తి చేయించాలని ఎమ్మెల్యేకు వినతి

ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ లో పెండింగ్ పనులు పూర్తి చేయించాలని మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు శనివారం హైదరాబాద్ లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డితో జరిగిన మీటింగ్ లో కోరారు. అన్ని వార్డుల్లో సీసీ డ్రెయిన్లు, సీసీ రోడ్స్ నిర్మించాలని, స్ట్రీట్స్ లైట్స్ ఏర్పాటు చేయించాలన్నారు. ఓపెన్ జిమ్ రిపేర్స్​ , స్మశాన వాటికల్లో సదుపాయాలు, పెర్కిట్ చెరువు ను మినీ ట్యాంక్ బండ్ గా మార్చాలని ఎమ్మెల్యేను కోరారు. త్వరలో అన్ని పనులకు నిధులు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో చైర్​ పర్సన్ పండిత్​ వినీత పవన్, వైస్ చైర్మన్ మున్ను, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

తెలంగాణ తిరుమల అభివృద్ధికి మరింత కృషి
స్పీకర్​ పోచారం శ్రీనివాస్​ రెడ్డి

బీర్కూర్, వెలుగు: తెలంగాణ తిరుమల దేవస్థానాన్ని మరింత అభివృద్ధి చేస్తామని స్పీకర్​ పోచారం శ్రీనివాస్​ రెడ్డి అన్నారు. శనివారం   బీర్కూర్​ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానం వద్ద రూ. 2.17 కోట్లతో  నిర్మించిన శ్రీనివాస గెస్ట్​ హౌజ్​ను  రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఎ ఇంద్రకరణ్ రెడ్డి,  పోచారం శ్రీనివాస్​ రెడ్డి,  మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి   ప్రారంభించారు. ఈ సందర్భంగా  కార్తీకమాస వన భోజనాల ఏర్పాటు చేశారు.  అనంతరం   సంగీత దర్శకుడు కోటి , శృతిలయ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.  ఈ సందర్భంగా    మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ..  ముఖ్యమంత్రి  దైవ భక్తుడని, అందుకే  రూ. 1200 కోట్ల వ్యయంతో కృష్ణ శిలతో యాదాద్రిని నిర్మించారన్నారు. పోచారం శ్రీనివాస్​రెడ్డి భక్తితో నియోజకవర్గంలో ఆలయాలను అభివృద్ధి చేస్తున్నారన్నారు. ఈ దేవాలయం అభివృద్ధి కోసం తమ వంతుగా సహకారం అందిస్తామన్నారు.  అనంతరం  పోచారం శ్రీనివాస్​రెడ్డి మాట్లాడుతూ..   ఆలయ అభివృద్ధికి రూ. 23 కోట్లను కేటాయించినట్టు చెప్పారు.  కార్యక్రమంలో  ఎంపీ బీబీపాటిల్,  ఎమ్మెల్యే లు హన్మంత్ షిండే, జాజుల సురేందర్,     కలెక్టర్ జితేష్ వి పాటిల్,  ఎస్పీ బి. శ్రీనివాస రెడ్డి దంపతులు, అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్​ దోత్రే,   జడ్పీ  చైర్మన్ దఫేదార్ శోభ రాజు దంపతులు,   జడ్పీ  చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, మాజీ ఎంపీ వేణుగోపాల చారీ, అసెంబ్లీ సెక్రటరీ డా. వి నరసింహా చార్యులు తదితరులు పాల్గొన్నారు. 

రాజీమార్గమే రాజమార్గం

బోధన్​, వెలుగు: బోధన్​ కోర్టులో జాతీయ లోక్​అదాలత్​లో 81 కేసులు పరిష్కారం అయినట్లు ఐదవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎస్​.రవికుమార్​    తెలిపారు. నేషనల్​ లీగల్​ సర్వీస్​ అథారిటీ ఆదేశాల మేరకు బోధన్​ న్యాయస్థానంలో మూడు బెంచీల ద్వారా సివిల్​, క్రిమినల్​, ఫ్రీ లిటిగేషన్, మెయింటనెన్స్​ కు సంబంధించి మొత్తం 81 కేసులు పరిష్కారమైనట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సీనియర్​ సివిల్​ జడ్జి దేవాన్​ అజయ్​కుమార్, అడిషనల్​ జూనియర్​ సివిల్​ జడ్జి  అపర్ణ  పాల్గొన్నారు.  

ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి మున్సిఫ్ కోర్ట్ పరిధిలోని నాలుగు మండలాల నుంచి 95 కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించినట్లు మేజిస్ట్రేట్ హారిక తెలిపారు. కేసుల పరిష్కరం కోసం లోక్​ అదాలత్​ను ఉపయోగించుకోవాలని, రాజీ మార్గం ఎంచుకోవాలని తెలిపారు.

మోడీకి భయపడి సీఎం పరారైండు

నిజామాబాద్, వెలుగు: రామగుండం ప్యాక్టరీ ప్రారంభోత్సవానికి పీఎం మోడీ వస్తే సీఎం కేసీఆర్​ పారిపోయిండని బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు ధన్​ పాల్ సూర్య నారాయణ విమర్శించారు. మోడీ మీటింగ్​ను చూసేందుకు  పట్టణంలోని ఉమా మహేశ్వర కల్యాణ మండపం లో బిగ్​ స్ర్కీన్​ ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణకు మోడీ ఏమీ తేలేదనడం టీఆర్ ఎస్ మూర్ఖత్వానికి నిదర్శనమని , వెంటనే ప్రధానికి కేసీఆర్​ క్షమాపణ చెప్పాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ల లక్ష్మి నారాయణ, ప్రధాన కార్యదర్శి పొతన్కర్ లక్ష్మి నారాయణ, కార్పొరేటర్లు పంచ రెడ్డి ప్రవళిక , మాస్టర్ శంకర్, నేతలు వినోద్ , కిసాన్ మోర్చా నాయకులు కౌడపు భరత్ భూషణ్, సుదర్శన్ రెడ్డి, దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు శివ ప్రసాద్ పాల్గొన్నారు.

డిచ్​పల్లి/ కామారెడ్డి/ ఎల్లారెడ్డి, వెలుగు :మోడీ పాలనతోనే రైతులకు మేలు జరుగుతుందని బీజేపీ లీడర్లు అన్నారు.  రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని ప్రధాని మోడీ  జాతికి అంకితం చేసిన సందర్భంగా మోడీకి ఉమ్మడి జిల్లా నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.  డిచ్​పల్లి, కామారెడ్డి, ఎల్లారెడ్డి లో    ప్రధాని సభ లైవ్​ ప్రోగ్రామ్​ను   బీజేపీ లీడర్లు, రైతులు చూశారు. ఆయా ప్రాంతాల్లో    బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు  ఇన్​చార్జి కులాచారి దినేశ్​​ కుమార్,  నిజామాబాద్​ పార్లమెంట్​ కన్వీనర్​, డిచ్​పల్లి ఎంపీపీ గద్దె భూమన్న,    కామారెడ్డి    నియోజక వర్గ ఇన్​చార్జీ  కాటిపల్లి వెంకటరమణరెడ్డి ,  జిల్లా జనరల్​ సెక్రటరీ తేలు శ్రీనివాస్​,  కౌన్సిలర్లు  మోటూరి శ్రీకాంత్​, శ్రీనివాస్​, ప్రవీన్​, లీడర్లు   దేవేందర్, బాలకిషన్  పాల్గొన్నారు.

ఘనంగా భీమన్న  కల్యాణం

ఆర్మూర్, వెలుగు :  మండలంలోని చేపూర్ లో మూడు రోజుల పాటు ఆదివాసీ నాయకపోడ్ సేవా సంఘం  ఆధ్వర్యంలో నిర్వహించిన భీమన్న దేవుని ఉత్సవాలు శనివారం ముగిశాయి.  భీమన్న  కల్యాణం నిర్వహించి ,  అగ్నిగుండంలో భక్తులు, పిల్లలు నడిచారు.  ఈ సందర్భంగా  అన్నదానం చేశారు.   కార్యక్రమంలో సంఘం పెద్దలు మేడిపల్లి రాజేశ్వర్, పొద్దుటూరి రాజేందర్, జిల్లా ఆదివాసి నాయకపోడ్ ఉద్యోగుల సేవా సంఘం కోశాధికారి కొసెడుగు రవి,   జిల్లా అధ్యక్షుడు గడ్డం శంకర్ , ప్రధాన కార్యదర్శి గాండ్ల రాంచందర్, బండారు భోజన్న, సురేశ్​, రాజేందర్  తదితరులు పాల్గొన్నారు. 

బాధితులకు  సీఎం ఆర్​ఎఫ్​తో అండ

సిరికొండ, వెలుగు: పేద ప్రజలకు  సీఎంఆర్​ఎఫ్​ అండగా నిలుస్తోందని ధర్పల్లి జడ్పీటీసీ బాజిరెడ్డి జగన్​ అన్నారు.  సిరికొండ కు చెందిన గంగాప్రసాద్​కు రూ.52వేల చెక్కును అందజేశారు.  నియోజకవర్గంలో వేలాది మంది లబ్ధిదారులకు సీఎంఆర్​ అందించామన్నారు.  కార్యక్రమంలో ఎంపీపీ సంగీత రాజేంధర్, రైతు సమన్వయ మండల అధ్యక్షుడు తిర్మల్​పాల్గొన్నారు.

షుగర్​వ్యాధిపై అవగాహన   కరపత్రాల  ఆవిష్కరణ

నందిపేట, వెలుగు: షుగర్​ వ్యాధిపై అవగాహన కల్పించే కరపత్రాలను   లయన్స్​క్లబ్​ ఆధ్వర్యంలో శనివారం ఆవిష్కరించారు.  వ్యాధిపట్ల   అవగాహన లేకపోవడంతో చాలామంది అందోళనకు గురవుతున్నారని క్లబ్​ అధ్యక్షులు గంగాధర్​ తెలిపారు. అందుకే అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రంలో ఎంపీడీఓ నాగవర్ధన్​, కార్యదర్శి సురేశ్​​, సభ్యులు  శౌరబాబు, జనార్ధన్​, గోపినాథ్​  పాల్గొన్నారు. 

డయోబెటిక్​ టెస్ట్​లు...

పిట్లం: లయన్స్​క్లబ్​ ఆధ్వర్యంలో అన్నారంలో డయబెటిక్​  డే  నిర్వహించారు.  ల్యాబ్​ టెక్నిషియన్, క్లబ్​ ప్రెసిడెంట్​ వెంకటరమణాగౌడ్​  50 మందికి రక్త పరీక్షలు నిర్వహించగా .. 30 మంది కి డయాబెటిస్​ గుర్తించారు.  ఈ కార్యక్రమంలో క్లబ్​ ట్రెసరర్​ డాక్టర్​ కిషన్​, ​ సభ్యులు కొంతం రాజ్ కుమార్​, బెజుగం చంద్రశేఖర్​ గ్రామ పెద్దలు హన్మంత్​రెడ్డి ఉన్నారు.