
- మంత్రి తుమ్మల వెల్లడి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ ఉత్పత్తులపై జిల్లాల వారీగా ఎగ్జిబిషన్లు నిర్వహిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అగ్రి–హార్టికల్చర్ సొసైటీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతు మహోత్సవం పేరుతో నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్‌ను మంత్రి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ లోని పలు స్టాళ్లలో ఏర్పాటు చేసిన మామిడి, ఐస్‌క్రీం, కుంకుడు కాయ ఉత్పత్తులు, సేంద్రీయ సాగు, తదితర ఉత్పత్తులను ఆయన పరిశీలించారు.
రైతులతో ముచ్చటించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. అగ్రికల్చర్ రంగంలో రైతులకు ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి రావాలన్నారు. వ్యవసాయంలో వచ్చిన నూతన ఆవిష్కరణలు రైతులకు చేరువ కావాలన్నారు.