ప్రైవేటు బడుల్లో 25 శాతం సీట్లు పేదలకు!

ప్రైవేటు బడుల్లో 25 శాతం సీట్లు పేదలకు!
  • వచ్చే ఏడాది నుంచే విద్యాహక్కు చట్టం అమలు 
  • విధివిధానాలు తయారు చేస్తున్న విద్యాశాఖ 
  • తొలుత ఫస్ట్ క్లాసు నుంచే అమలుకు యోచన 
  • వరుసగా పదేండ్లు అన్ని తరగతుల్లో 
  • ఇంప్లిమెంట్‌ చేసేలా నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేటు బడుల్లో పేద విద్యార్థులకు ఉచితంగా 25 శాతం సీట్లను కేటాయించేందుకు సర్కారు కసరత్తు చేస్తున్నది. వచ్చే విద్యాసంవత్సరం నుంచే దీనిని అమలు చేయాలని నిర్ణయించింది. ఇదే విషయాన్ని ఇటీవల హైకోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో దీనిని ఎలా అమలు చేయాలనే దానిపై అధికారులు చర్చలు జరుపుతున్నారు.దేశంలో 2009లో తీసుకొచ్చిన విద్యాహక్కు చట్టంలోని సెక్షన్12 (1)సీ ప్రకారం ప్రీ ప్రైమరీ, ఒకటో తరగతిలో 25 శాతం సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. 

దేశవ్యాప్తంగా తెలంగాణతో పాటు మరో ఆరు రాష్ట్రాలు మాత్రమే దీనిని అమలు చేయడం లేదు. మిగిలిన రాష్ట్రాలు కొంతమేర అమలు చేస్తున్నాయి. అయితే, చట్టం అమల్లోకి వచ్చి ఏండ్లు గడుస్తున్నా అమలు చేయకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం ఒత్తిడి తీసుకొస్తోంది. దీనికితోడు ఉన్నత న్యాయస్థానాలూ ఈ చట్టాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలిచ్చాయి. దీంతో వచ్చే ఏడాది నుంచి విద్యా హక్కు చట్టం అమలు చేయనున్నట్లు రాష్ట్ర సర్కార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హైకోర్టుకు తెలిపింది.


ఈ క్రమంలో రాష్ట్రవాప్తంగా ఉన్న దాదాపు 11,500 ప్రైవేటు స్కూళ్లల్లో 25 శాతం సీట్లను పేదలకు కేటాయించేందుకు చర్యలు ప్రారంభించింది. కాగా, విద్యాహక్కు చట్టం అమలు కమిటీలోని కొన్ని అంశాలను సవరణ చేయాలని ఇటీవల స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు సర్కారుకు ప్రతిపాదనలు పంపించారు. దీంతో త్వరలోనే విద్యాహక్కు చట్టం అమలు కమిటీ సమావేశం కానున్నది. 

ప్రతిపాదనలు రెడీ.. 

రాష్ట్రంలో 25 శాతం సీట్ల అమలుపై రెండు, మూడు ప్రతిపాదనలను విద్యాశాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు. అన్ని ప్రైవేటు బడుల్లో 25 శాతం ఉచిత సీట్ల విధానం అమలు చేస్తే సర్కారు బడుల్లో ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తగ్గే ప్రమాదం ఉందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు సర్కారుపైనా భారీగా భారం పడే అవకాశం ఉంది. అయితే, కర్నాటకలో అమల్లో ఉన్నట్టు విద్యార్థి చదివే చోటకు దగ్గరలో సర్కారు బడి లేకుంటే దీనిని అమలు చేయాలనే ప్రతిపాదన ఉంది.

ALSO READ : తెలంగాణలో 10 వేల కోట్లతో ఐ డేటా సెంటర్ భారీ పెట్టుబడులు 

దీనివల్ల చాలా వరకు సర్కారుపై ఎఫెక్ట్ పడబోదనే భావన ఉంది. ఈ లెక్కన తొలి ఏడాది సుమారు 10 వేల నుంచి 15 వేల మందికే ఫీజు చెల్లించే అవకాశం ఉంటుంది. అయితే, ఫీజులను ఎలా నిర్ణయించాలనే దానిపై అధికారులు చర్చిస్తున్నారు. ప్రస్తుతం స్కూళ్లల్లో వసూలు చేస్తున్న ఫీజు గానీ, ప్రభుత్వం ఒక స్టూడెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఖర్చు చేసే యావరేజీలో ఏది తక్కువగా ఉంటే దానిని అమలు ఫీజుగా నిర్ణయించాలని ఉమ్మడి రాష్ట్రంలో తీసుకొచ్చిన జీవోలో ఉంది. దీంతో దీనిని అమలు చేయలా.. ఇందులో ఏమైనా మార్పులు చేయాలా అనే దానిపై అధికారులు ఆలోచనలు చేస్తున్నారు. వీటిపై త్వరలో సర్కారు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

ఫస్ట్ క్లాసు నుంచే అమలు..

వచ్చే విద్యా సంవత్సరం ఒకటో తరగతి నుంచి పేద విద్యార్థులకు ఉచిత సీట్లను ప్రభుత్వం కేటాయించనుంది. రెండో ఏడాది రెండో తరగతి దాకా, మూడో ఏటా థర్డ్ క్లాసు దాకా.. ఇలా పదేండ్లలో అన్ని క్లాసులకు ఇది వర్తింపజేయనుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రైవేటు బడుల్లో ఏటా సుమారు 4 లక్షల మంది వరకు ఒకటో తరగతిలో చేరుతున్నారు. వీరిలో 25 శాతం అంటే సుమారు లక్ష మందికి ఉచిత విద్య అందనున్నది. ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సహా అన్ని రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. ఎంపిక విధానంలోనూ పేరెంట్స్ ఆర్థిక స్థితిగతులను పరిగణనలోకి తీసుకోనున్నారు. 2010లో రూపొందించిన ఇన్ కమ్ 
కాకుండా.. కొత్తగా దీనిని మార్చనున్నారు.